![]() |
![]() |
.webp)
ఢీ షో ఈ వారం ఆది డైలాగ్స్ తో, పంచెస్ తో ఫుల్ ఎంటర్టైన్ చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ గా హైపర్ ఆది ఓవర్ యాక్షన్ కి దీపికా పిల్లి రివర్స్ కౌంటర్ వేసింది. దీపికా పిల్లి సింగర్ గా వచ్చింది. స్టేజి మీదకు ఆది రాగానే పక్కనే ఉన్న అజర్ తో " ఆ బ్లాక్ డ్రెస్ అమ్మాయిని పిలువు బ్రేక్ ఇచ్చేద్దాం" అని చెప్పేసరికి అజర్ దీపికాని పిలిచాడు "నీ పేరేంటి" అని ఆది అడిగాడు. "దీపికా" అంది. " పేరులోనే దీపం ఉంది..ఆర్పేద్దాం" అన్నాడు ఆది. చూడు దీపికా "నాకు ఈ శ్రుతులు, లయలు, గొళ్ళాలు, తలుపులు రావు స్ట్రైట్ గా పాయింట్ కి వచ్చేద్దాం..ఢీలో టీం లీడర్స్ మధ్య బంధం అనేది భార్యాభర్తల సంబంధం లాంటిది..అర్దమయ్యిందా" అనేసరికి "అర్ధమయ్యింది...నిన్ను చెప్పుతో కొట్టాలని అర్ధమయ్యింది" అంది దీపికా. "ఒక్కో స్వరానికి ఒక్కో నాదం ఉంటుంది.. నేను మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలని అనుకుంటాను..మీరు రారు ఇక్కడే ఉంటారు. నీ వస్త్రాలంకరణపై పెట్టిన దృష్టి కొంచెం నా మీద పెట్టి ఉంటే అప్పుడు" అని ఆది అనేసరికి దీపికా ఆ మాటకు షాకయ్యింది.
ఆ తర్వాత మెహర్ రమేష్, వాళ్ళ అబ్బాయి సాగర్ ఈ స్టేజి మీదకు వచ్చారు. ఆది వాళ్ళ మీద కూడా పంచులు వేసి నవ్వించాడు. ఇక ఇక్కడ ఆది చెప్పిన మాటలకు అందరూ నవ్వేశారు "నేను మెహర్ రమేష్ గారు భోళా శంకర్ మూవీకి మ్యూజిక్ సిట్టింగ్స్ కి కూర్చున్నాం.. ఏదేమైనా ఆది మ్యూజిక్ త్వరగా కంప్లీట్ చేయాలి అని అన్నారు..మనం ఎంత ఉల్లాసంగా ఉండాలి అంటే..జాంజాంగా చేసేయాలి అన్నారు. జాంజాంగా చేసేయడమేంటండి జాంజాం చేసేద్దాం అని చెప్పా.. అలా వచ్చిందే "జాంజాంజాంజాం జజ్జనక" అనే సాంగ్ వచ్చింది..ఈ మొత్తం సాంగ్ నేనే కంపోజ్ చేశా. మధ్యలో కొంచెం బీట్ మార్చాలని నర్సాపెల్లె అనే ఫోక్ బీట్ పెడదామని చిరు గారిని అడిగాను. ఆయన చెయ్యెత్తారు..సరే మీరే డెసిషన్ తీసుకోండి" అని చెప్పా అన్నాడు ఆది.
![]() |
![]() |